రాష్ట్ర స్థాయి సైన్స్‌ సెమినార్‌కు ఆహ్వానం

ABN , First Publish Date - 2021-02-05T06:56:50+05:30 IST

రాష్ట్ర స్థాయి సైన్స్‌ సెమినార్‌కు ఆహ్వానం

రాష్ట్ర స్థాయి సైన్స్‌ సెమినార్‌కు ఆహ్వానం

ములుగుటౌన్‌, ఫిబ్రవరి 4 : సైన్స్‌ దినోత్సవం ఫిబ్రవరి 28న రాష్ట్ర స్థాయి పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్‌ సెమినార్‌కు పరిశోధన పత్రాలను పంపాలని డీఈవో వాసంతి ఒక ప్రకటనలో కోరారు. ‘భారతదేశ అభివృద్ధికి సైన్స్‌-శాస్త్రీయ విద్య’ ప్రధాన అంశంగా, ‘స్వావలంబన ఇండియాకు సైన్స్‌, తరగతి గది లోపల, బయట ఉపాధ్యాయుల పాత్ర, నూతన విద్యావిఽధానం 2020 సైన్స్‌ విద్యను ప్రభావితం చేసే మార్గాలు, సైన్స్‌ బోధన సాధనాలుగా ఆటలు, బొమ్మలు’ అనే ఉప అంశాలపై సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు పే ర్కొన్నారు. ఆసక్తిగల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పరిశోధకులు, ఎన్‌ జీవోస్‌, సంస్థలు, విద్యావేత్తలు తమ పరిశోధనా పత్రాలు, రిపోర్టులను ఈనెల 28లోపు tgscertmathsscience@gmail.com మెయిల్‌కు పంపాలని, పూర్తి వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి జయదేవ్‌ను 9912342270 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.


Updated Date - 2021-02-05T06:56:50+05:30 IST