7 రోజుల్లో క్షమాపణ చెప్పాలి
ABN , First Publish Date - 2021-07-11T08:17:43+05:30 IST
‘టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించేందుకు నేను రూ.25 కోట్లు లంచం తీసుకున్నానని ఆరోపించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఏడు రోజుల్లోగా
లేదంటే రూ.కోటి పరువునష్టం దావా వేస్తా
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీస్
హైదరాబాద్/న్యూఢిల్లీ, జూలై 10(ఆంధ్రజ్యోతి): ‘టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించేందుకు నేను రూ.25 కోట్లు లంచం తీసుకున్నానని ఆరోపించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఏడు రోజుల్లోగా బహిరంగ క్షమా పణ చెప్పాలి. లేదంటే రూ.కోటి పరువునష్టం దావా వేస్తా’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ హెచ్చరించారు. ఈ మేరకు న్యాయవా ది ఆర్. రవీంద్రన్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈ నెల 3న టీఆర్ ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సుధీర్‌రెడ్డి తనపై నిరాధా రమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయన్నారు. తన ప్రతిష్ఠను దిగజార్చేలా చేసిన తప్పుడు ఆరోపణలు తన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని, తాను మానసిక క్షోభకు గురయ్యాయని, అందుకే లీగల్ నోటీసు పంపినట్లు వెల్లడించారు.