4వేల మంది ఉద్యోగులు, 6వేల మంది ఫ్రంట్‌లైన్‌ కార్మికుల కోసం వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను చేపట్టిన అపర్ణ గ్రూప్‌

ABN , First Publish Date - 2021-05-04T11:40:29+05:30 IST

బిల్డింగ్‌ మెటీరియల్స్‌ తయారీ, రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అపర్ణ గ్రూప్‌.. తమ ఉద్యోగులు, ఫ్రంట్‌ లైన్‌ కార్మికుల కోసం వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది.

4వేల మంది ఉద్యోగులు, 6వేల మంది ఫ్రంట్‌లైన్‌ కార్మికుల కోసం వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను చేపట్టిన అపర్ణ గ్రూప్‌

బిల్డింగ్‌ మెటీరియల్స్‌ తయారీ, రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అపర్ణ గ్రూప్‌.. తమ ఉద్యోగులు, ఫ్రంట్‌ లైన్‌ కార్మికుల కోసం వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది. గ్రూపునకు చెందిన అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌ కంపెనీలన్నింటిలో ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ జరగనుంది.ఈ డ్రైవ్‌ను అపర్ణ గ్రూప్‌ స్వయంగా స్పాన్సర్‌ చేస్తుంది. దీనిద్వారా అపర్ణ గ్రూప్‌‌లో ఉద్యోగాలు చేస్తున్న 4వేల మంది ఉద్యోగులు, 6వేల మంది ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు వ్యాక్సిన్‌లను అందించనున్నారు. ఇప్పటివరకూ 360 మంది ఉద్యోగులు వ్యాక్సిన్‌ తీసుకున్నారు.


త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ ప్రతినిధులు ఆశిస్తున్నారు. దీనితో పాటుగా ఉద్యోగుల భద్రత కోసం కంపెనీ పలు చర్యలను తీసుకుంది. కరోనా మహమ్మారి వచ్చిన కొత్తలోనే ప్రధానమంత్రి సహాయ నిధితో పాటుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాలను అందించిన కొద్ది సంస్థలలో అపర్ణ గ్రూప్‌ ఒకటి. కోవిడ్‌ సంక్షేమ కార్యక్రమాల కోసం 5 కోట్ల రూపాయలను ఈ గ్రూప్ విరాళంగా అందించింది.

Updated Date - 2021-05-04T11:40:29+05:30 IST