తెలంగాణ లాక్‌డౌన్‌తో ఏపీ రైతుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2021-05-30T09:41:29+05:30 IST

తెలంగాణ పోలీసులు లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తుండటంతో ఆంధ్ర ప్రాంత రైతులు, సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణ లాక్‌డౌన్‌తో ఏపీ రైతుల ఇక్కట్లు

చాట్రాయి, మే 29: తెలంగాణ పోలీసులు లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తుండటంతో ఆంధ్ర ప్రాంత రైతులు, సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్ర-తెలంగాణను కలిపే గ్రామీణ రహదారులపై తెలంగాణ పోలీసులు కంప చెట్లు వేసి మూసేయడంతో ఇక్కడి వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఏపీ పరిధిలోని సరిహద్దు గ్రామాల రైతులకు తెలంగాణలో భూములు ఉన్నాయి. కృష్ణాజిల్లా చాట్రాయి మండలంలోని కృష్ణారావుపాలెం, తెలంగాణ పరిధిలోని వెంకటాపురం గ్రామాలు క లిసే ఉంటాయి. మండలంలోని పర్వతాపురానికి, తెలంగాణలోని బరిణపాడుకు మధ్య నల్లచెరువు ఉంది. ఈ చెరువు అలుగు ఏపీలో ఉంది. ఈ చె రువు ఆయకట్టులో రెండు రాష్ట్రాల రైతులకు భూములు ఉన్నాయి. బరిణపాడు వద్ద తెలంగాణ చెక్‌పోస్టు ఏర్పాటు చేసి పోలీసులు కఠినమైన అం క్షలు అమలు చేస్తున్నారు. రైతులు, రైతు కూలీలను కూడా భూముల వద్దకు వెళ్లనీయకపోవటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. 

Updated Date - 2021-05-30T09:41:29+05:30 IST