జగన్‌ అక్రమాస్తుల కేసు..

ABN , First Publish Date - 2021-02-05T08:51:58+05:30 IST

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న పెన్నా సిమెంట్స్‌ అధినేత పెన్నా ప్రతా్‌పరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌లో వరుసగా రెండోరోజూ వాదనలు కొనసాగాయి...

జగన్‌ అక్రమాస్తుల కేసు..

  • ‘పెన్నా’ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా


హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న పెన్నా సిమెంట్స్‌ అధినేత పెన్నా ప్రతా్‌పరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌లో వరుసగా రెండోరోజూ వాదనలు కొనసాగాయి. ప్రతాపరెడ్డి తరపున న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు గురువారం వాదనలు వినిపిస్తూ.. అనంతపురం జిల్లా యాడికి మండలంలో పెన్నా సిమెంట్స్‌ సంస్థ కోసం చేసిన భూ సేకరణలో అక్రమాలు జరగలేదని తెలిపారు. సీబీఐ అభియోగాలు సత్యదూరమని చెప్పారు. పెన్నా ప్రతా్‌పరెడ్డి తరపు న్యాయవాది వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బీఆర్‌ మధుసూధన్‌రావు.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా.. ఓఎంసీ మైనింగ్‌ కేసులో ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చారి పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సీబీఐ తరఫు న్యాయవాది గడువు కోరారు. అందుకు న్యాయమూర్తి సమ్మతించారు. విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - 2021-02-05T08:51:58+05:30 IST