రైతులు మనోధైర్యం కోల్పోవద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు

ABN , First Publish Date - 2021-12-31T19:50:37+05:30 IST

రైతులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అఽధ్యక్షుడు సుంకేట అన్వేష్‌రెడ్డి అన్నారు.

రైతులు మనోధైర్యం కోల్పోవద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు

కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు  అన్వేష్‌రెడ్డి 

టేకుమట్ల, డిసెంబరు 30: రైతులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అఽధ్యక్షుడు సుంకేట అన్వేష్‌రెడ్డి అన్నారు. మరణాలతో సమస్యలు పరిష్కారం కావని, ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాన్ని కష్టాల పాల్జేయొద్దని అన్నారు. మండలంలోని సుబ్బక్క పల్లి గ్రామానికి చెందిన రైతులు సిద్దూరి రవీందర్‌రావు, గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన అకినపల్లి సారయ్య ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకోగా వారి కుటుంబాలను ఆయన గురువారం పరామర్శించారు.  ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం  గుమ్మడవెల్లి గ్రామంలో రైతు లతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులే పంటలు పండిచండంతో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు.  ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు.  రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు ఆనేక ఇబ్బందులు పడు తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని అన్నారు. రైతు సంక్షేమం కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నమని చెబుతున్న అధికార పార్టీ నాయకులు అక్క డ జరుగుతున్న అవినీతిని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. 


వెస్ట్రన్‌ తామర పురుగు ఆశించి మిర్చి పంటపూర్తిగా నాశనమై చాలా మంది రైతులు మన స్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభు త్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రాబోయే యా సంగిలో రైతులు ఎవరూ వరిపంట వేయకూడదని ప్రభు త్వం చెప్పడం సరికాదన్నారు. చెరువుల, కుంటల వాగులను అనుకోని ఉన్న భూముల్లో రైతులు వరిపంట కాకుండా వేరే పంటలు సాగుచేయడానికి వీలు ఉండన్నారు. అది అలోచించకుండా రైతులు వరి పండిం చకూడదని ఆదేశాలు జారీ చేయడం సరికాదని అన్నారు. రైతులు పండిస్తున్న పంటలను ఎలా కొనుగోలు చేయా లలో ప్రణాళిక చేయాలి తప్ప ఆంక్షాలు విధించకూడదని హితవు పలికారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రైతులు అన్ని విధాలుగా చేయూతనించిందని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామన్నారు.  కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి  గండ్ర సత్యనారయణరావు మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలన వల్లే రైతులు ఆత్మహ త్యలు చేసుకుంటున్నారని అన్నారు.  రైతులు విత్తనాలు వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు వివిధ వర్గాలు రైతులను నిలువునా దోచుకుంటుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రేక్షక పాత్రపోస్తోందని విమర్శించారు.  రైతుల వ్యతిరేక పాలన చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు బుద్ధి చెప్పేందుకు పోరాటమే ఏకైక మార్గమన్నారు. రైతులంతా కలిసికట్టుగా  పోరాటాలు చేయాలన్నారు. రాబోయే రోజులలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఐతా ప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్‌  రాష్ట్ర సమన్వయ కర్త శశిభూషణ్‌, మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్‌, చిట్యాల మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా కార్యదర్శి వైనాల రవీందర్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్‌, నాయకులు పెరుమాండ్ల లింగయ్య, మోతే రాజమౌళి, దాసారపు సదానందం, బండి సుదర్మన్‌  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T19:50:37+05:30 IST