ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి సీఎం దాక కమిషన్లు

ABN , First Publish Date - 2021-12-31T20:06:58+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి సీఎం కేసీఆర్‌ దాక కమిషన్‌లు తీసుకుంటున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి ఆరోపించా రు.

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి సీఎం దాక కమిషన్లు

కాంగ్రెస్‌ రాష్ట్ర కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి 

మహబూబాబాద్‌ రూరల్‌, డిసెంబరు 30 : రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి సీఎం కేసీఆర్‌ దాక కమిషన్‌లు తీసుకుంటున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రం శివారు ఈదులపూసపల్లి గ్రామంలో గురువారం జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కొ నుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో క్వింటాకు 10 కేజీలు తీసుకుంటూ మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. గత ఏడాది రాష్ట్ర వ్యా ప్తంగా 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే అందులో తీసిన ధాన్యం విలువ రూ.వెయ్యి కోట్ల ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు విషయంలో ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ను తీసుకోమని, రా రైస్‌ను మాత్రమే తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి సాగు చేయవద్దని, ఒక గిం జ కూడా ఖరీదు చేసేది లేదని సీఎం చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారని, ఆ రైతులకు పంట చేతికి వచ్చే సమయంలో వైరస్‌, తెగుళ్లు సోకి పంట చేతికందకుండ పోయి పెట్టిన పెట్టుబడి కూడ రాకుండ పోయిందన్నారు. దీంతో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. నకిలీ మిర్చి విత్తనాల వల్లనే ఈ తెగుళ్లు వచ్చాయని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని పిలుపునిచ్చారు.


ఆదివాసీ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు బెల్లయ్యనాయక్‌ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికే కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగమే కార్పొరేట్‌ కంపెనీలకు భూములను లీజు కు ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఎమ్మె ల్యే శంకర్‌నాయక్‌ భూకబ్జాలకు పాల్పడుతున్నారని, అఖిలపక్ష పార్టీలను పిలిపించి సమావేశం ఏర్పాటు చేస్తే తాము వచ్చి ఎమ్మెల్యే పేరుమీద ఉన్న భూముల వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.  కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వెన్నం లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు భరత్‌చందర్‌రెడ్డి, డాక్టర్‌ మురళీనాయక్‌, నూనావత్‌ రాధ, దస్రునాయక్‌, జిన్నారెడ్డి పద్మజవెంకటేశ్వర్లు, కౌన్సిల ర్లు పోతురాజు రాజు, జగన్‌, ఎంపీటీసీలు రాంచందర్‌, రోజా, కత్తిస్వా మి, రమే్‌షనాయక్‌, మహేందర్‌రెడ్డి, కలీల్‌, ముసలయ్య, లక్ష్మినారాయ ణ, రంగన్నగౌడ్‌, హెచ్‌.వెంకటేశ్వర్లు, మిట్టకంటి రాంరెడ్డి, దేవరం ప్రకాష్‌రెడ్డి, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వెంకన్న, బానోత్‌ ప్రసాద్‌, గుగులో తు వెంకట్‌,  సర్పంచ్‌ ఎన్నం శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T20:06:58+05:30 IST