రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి: ఆర్‌.నారాయణమూర్తి

ABN , First Publish Date - 2021-10-21T02:01:07+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని నిర్మాత, సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి: ఆర్‌.నారాయణమూర్తి

నర్సంపేట: రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని నిర్మాత, సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఉద్యమంలో 600 మంది అమరులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30న రైతన్న సినిమా విడుదలవుతుందని నారాయణమూర్తి పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-21T02:01:07+05:30 IST