రుణ యాప్‌ల కేసులో మరో రూ. 51కోట్ల ఆస్తులు అటాచ్
ABN , First Publish Date - 2021-12-16T02:30:24+05:30 IST
దేశంలో సంచలనం సృష్టించిన రుణ యాప్‌ల కేసులో మరో

హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టించిన రుణ యాప్‌ల కేసులో మరో రూ. 51కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన రూ.51 కోట్లను అటాచ్ చేసింది. గతంలో పీసీఎఫ్ఎస్‌కు చెందిన రూ.238 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా రుణాలను పీసీఎఫ్ఎస్ ఇచ్చింది. చైనాకు చెందిన జో యాహుయ్ అధీనంలో పీఎస్ఎఫ్ఎస్ పనిచేస్తోందని ఈడీ గుర్తించింది. బోగస్ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల పేరిట విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్‌కు సుమారు రూ.429 కోట్లు తరలించినట్లు ఈడీ వెల్లడించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్ఎస్ సొమ్ము జప్తు చేశామని ఈడీ పేర్కొంది. ఈడీ దర్యాప్తు ఆధారంగా ఆర్బీఐ, ఐటీ విచారణ ప్రారంభించాయి.