మరో 301 పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2021-01-13T08:23:25+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 301 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 2,90,309కు పెరిగింది. కొవిడ్‌తో ఇద్దరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1,568కు చేరింది. సోమవారం మరో 293 మంది

మరో 301 పాజిటివ్‌లు

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 301 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 2,90,309కు పెరిగింది. కొవిడ్‌తో ఇద్దరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1,568కు చేరింది. సోమవారం మరో 293 మంది డిశ్చార్జి కావడంతో కోలుకున్న వారి సంఖ్య 2,84,217కు పెరిగింది. ప్రస్తుతం 4,524 యాక్టివ్‌ కొవిడ్‌ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 58 పాజిటివ్‌లు రాగా, మేడ్చల్‌లో 27, రంగారెడ్డిలో 16 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో 719,  ప్రైవేటు ఆస్పత్రుల్లో 1346 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-01-13T08:23:25+05:30 IST