ఏసీబీ డీజీగా అంజనీకుమార్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-12-26T08:58:37+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీజీగా అంజనీ కుమార్‌ శనివారం బాధ్యతలు చేపట్టారు.

ఏసీబీ డీజీగా అంజనీకుమార్‌ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌ కొత్వాల్‌గా సీవీ ఆనంద్‌ చార్జ్‌

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీజీగా అంజనీ కుమార్‌ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తనపై ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. కాగా.. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్‌ ముగించుకుని, వెయిటింగ్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ శనివారం హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హైదరాబాద్‌లోనే విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి.. ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌ తూర్పు, మధ్య మండలాల డీసీపీగా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా కూడా సేవలందించారు.

Updated Date - 2021-12-26T08:58:37+05:30 IST