ఈ-ఓటింగ్‌కు వీలు కల్పించే యాప్‌

ABN , First Publish Date - 2021-10-07T07:37:08+05:30 IST

స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఓటు వేయడానికి వీలు కల్పించే ఈ-ఓటింగ్‌ యాప్‌ను

ఈ-ఓటింగ్‌కు వీలు కల్పించే యాప్‌

ఖమ్మంలో ప్రయోగాత్మకంగా రాష్ట్ర ఐటీ శాఖ అమలు

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఓటు వేయడానికి వీలు కల్పించే ఈ-ఓటింగ్‌ యాప్‌ను రూపొందించినట్టు తెలంగాణ ఐటీ శాఖ వెల్లడించింది. పోలింగ్‌ కేంద్రాలకు రాలేని వారిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం యాప్‌ రూపకల్పనకు చొరవ తీసుకుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. బుధవారం యాప్‌కు తుదిరూపు ఇచ్చారు. అక్టోబరు 8 నుంచి 18వ తేదీ మధ్య ఖమ్మంలో ప్రయోగాత్మకంగా ఈ-ఓటింగ్‌ యాప్‌ను అమలు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ చెప్పారు.


రిజిరేస్టషన్‌ ప్రక్రియ నిర్వహించి, 20వ తేదీన అక్కడే డమ్మీ ఓటింగ్‌ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యం సరిగాలేక పోలింగ్‌ కేంద్రానికి రాలేనివారు, సైనికులు, ఎన్నికల అధికారులు, వికలాంగులు, వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక విధులు నిర్వహించేవారికి తేలిగ్గా ఓటు వేసే సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ యాప్‌కు రూపకల్పన చేశారు. రాష్ట్ర ఐటీ విభాగం, సీడ్యాక్‌తోపాటు బాంబే, భిలాయ్‌ ఐఐటీలకు చెందిన నిపుణులు దీని రూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఓటింగ్‌ ప్రక్రియ మొత్తం టెక్నాలజీ ఆధారంగానే సాగే ఈ యాప్‌ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉంది.


Updated Date - 2021-10-07T07:37:08+05:30 IST