18న టీడీపీ ఆధ్వర్యంలో అమరజ్యోతి ర్యాలీ
ABN , First Publish Date - 2021-01-12T08:52:30+05:30 IST
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా ఈనెల 18న అమరజ్యోతి ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి సతీష్‌కుమార్ తెలిపారు

ఎన్టీఆర్ 25వ వర్ధంతికి హాజరుకానున్న బాబు
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా ఈనెల 18న అమరజ్యోతి ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి సతీష్‌కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 18న ఉదయం 11 గంటలకు రసూల్‌పుర చౌరస్తాలో ప్రారంభమయ్యే ర్యాలీకి టీడీపీ జాతీయ అధ్యక్షులు ఎన్.చంద్రబాబునాయుడు హాజరవుతారని చెప్పారు. ఎన్టీఆర్‌ఘాట్ వరకు కొనసాగే ఈ ర్యాలీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఆ రోజు ఎన్టీఆర్ భవన్‌లో లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిం చనున్నట్లు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న చెప్పారు.
నియోజకవర్గస్థాయిలో రక్తదాన, అన్నదాన శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.దుర్గాప్రసాద్ తెలిపారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని పార్టీ నేతలను కోరారు. మద్యం నియంత్రణ కోసం తెలుగు మహిళా విభాగం తరపున ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన చెప్పారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌ల హామీ అమలు కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటాలు చేస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజునాయక్ అన్నా రు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన జరిగి న సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.