అళ్వారు స్వామి సాహిత్యకృషి అజరామరం: కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-11-02T09:00:51+05:30 IST

తెలంగాణ తొలితరం నవలా సాహిత్యకారుడు వట్టికోట అళ్వారుస్వామి స్ఫూర్తి రాష్ట్ర సాధన కోసం సాగిన సాహిత్య, సాంస్కృతిక ఉద్యమంలో కీలకభూమిక పోషించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. అళ్వారుస్వామి జయంతి సందర్భంగా సీఎం ఆయన సేవలను స్మరించుకున్నారు.

అళ్వారు స్వామి సాహిత్యకృషి అజరామరం: కేసీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తొలితరం నవలా సాహిత్యకారుడు  వట్టికోట అళ్వారుస్వామి స్ఫూర్తి రాష్ట్ర సాధన కోసం సాగిన సాహిత్య, సాంస్కృతిక ఉద్యమంలో కీలకభూమిక పోషించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. అళ్వారుస్వామి జయంతి సందర్భంగా సీఎం ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పాత్రికేయుడిగా, కథకుడిగా, నవలాకారుడిగా తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ఆయన సాహిత్య కృషి అజరామరమని పేర్కొన్నారు.

Updated Date - 2021-11-02T09:00:51+05:30 IST