బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌గా అలోక్‌ కుమార్‌

ABN , First Publish Date - 2021-12-28T07:59:54+05:30 IST

బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌గా అలోక్‌ కుమార్‌ నియమితులయ్యారు. బీసీ

బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌గా అలోక్‌ కుమార్‌

 బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌గా అలోక్‌ కుమార్‌ నియమితులయ్యారు. బీసీ కార్పొరేషన్‌ ఎండీ, ఎంబీసీ కార్పొరేషన్‌ సీఈవోగా కొనసాగుతున్న అలోక్‌ను పరిపాలనా పరమైన బదిలీల్లో భాగంగా స్టడీ సర్కిల్‌ డైరెక్టరుగా నియమించారు. ఆయన స్థానంలో.. గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టుకు తాత్కాలిక అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. కాగా.. బీసీ కార్పొరేషన్‌ ఎండీ స్థాయి అధికారిని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌గా నియమించడం ఉద్యోగ హోదా తగ్గించడమేననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సమయంలో బీసీ సంక్షేమ శాఖలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం మరింత వివాదాస్పదంగా మారింది. 


Updated Date - 2021-12-28T07:59:54+05:30 IST