శ్రీచైతన్య బ్రాండ్ అంబాసిడర్గా అల్లు అర్జున్
ABN , First Publish Date - 2021-10-17T08:29:17+05:30 IST
సినీ నటుడు అల్లు అర్జున్.. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు.
సినీ నటుడు అల్లు అర్జున్.. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శ్రీచైతన్య విద్యాసంస్థలతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఛైర్మన్ డాక్టర్ బిఎ్స.రావు, అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బన్నీ.. శ్రీచైతన్యకు ప్రచారం కల్పిస్తే.. సంస్థ మార్కెట్ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువ నటుడితో భాగస్వామ్యం ద్వారా తమ విద్యాసంస్థలకు మరింత ప్రాచుర్యం లభిస్తుందన్నారు. ఒప్పందం పట్ల అల్లు అర్జున్ కూడా హర్షం వ్యక్తం చేశారని సంస్థ తెలిపింది.