బీఈడీ మొదటి దశ సీట్ల కేటాయింపు

ABN , First Publish Date - 2021-12-26T09:16:19+05:30 IST

బీఈడీ కోర్సులకు మొదటి దశలో 10,216 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు తెలంగాణ రాష్ట్ర ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రమే్‌షబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

బీఈడీ మొదటి దశ సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : బీఈడీ కోర్సులకు  మొదటి దశలో 10,216 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు  తెలంగాణ రాష్ట్ర ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రమే్‌షబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కన్వీనర్‌ కోటాలో  14,464 సీట్లు అందుబాటులో ఉండగా, వెబ్‌ ఆప్షన్‌లో 17,417 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు జాయినింగ్‌ లెటర్‌, ట్యూషన్‌ ఫీజు చెల్లింపు దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. యూనియన్‌ బ్యాంక్‌లో ఫీజు చెల్లించాలని తెలిపారు. విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌, ఫీజు కట్టిన రశీదుతో ఈ నెల 27 నుంచి 30వ తేదీ మధ్య వారికి కేటాయించిన కాలేజీలో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-12-26T09:16:19+05:30 IST