రూ.11 కోట్ల చొప్పున కేటాయించండి

ABN , First Publish Date - 2021-12-15T08:41:40+05:30 IST

రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధమవుతుండడంతో రూ.11 కోట్ల చొప్పున రూ.22 కోట్ల కేటాయింపులు చేయాలని తెలుగు రాష్ట్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కోరింది.

రూ.11 కోట్ల చొప్పున కేటాయించండి

2022-23 ఏడాదికి తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ విజ్ఞప్తి

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధమవుతుండడంతో రూ.11 కోట్ల చొప్పున రూ.22 కోట్ల కేటాయింపులు చేయాలని తెలుగు రాష్ట్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కోరింది. ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి బోర్డులో వేతనాలు, నిర్వహణ, ప్రాజెక్టుల్లో వివిధ సర్వేలు, రెండో దశ టెలిమెట్రీ యంత్రాలు.. అంతా కలుపుకొని రూ.22 కోట్లు అవుతాయని లెక్క తీశా రు. దీని కోసం తెలుగు రాష్ట్రాలు తలా రూ.11 కోట్లను బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని సూచించింది. ఏపీలో మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేయడం, తాజాగా మళ్లీ బిల్లు పెట్టాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడంతో.. రాజధాని ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతానికి బోర్డును తరలించే అవకాశం ఉంటుంది. గతంలో విశాఖకు తరలించాలని యోచించగా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా బేసిన్‌ లోపలే బోర్డు ఉండాలని కోరింది. 

Updated Date - 2021-12-15T08:41:40+05:30 IST