ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-02-01T09:00:48+05:30 IST

రాష్ట్రంలో ధార్మిక పరిషత్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని అఖిల భారత హిందూ మహాసభ తెలంగాణ శాఖ డిమాండ్‌ చేసింది. దేవాదాయశాఖ కార్యకలాపాలను ధార్మిక పరిషత్‌ ద్వారా నడిపించాలని 2009లోనే ప్రభుత్వం

ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలి

అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్‌


హైదరాబాద్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధార్మిక పరిషత్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని అఖిల భారత హిందూ మహాసభ తెలంగాణ శాఖ డిమాండ్‌ చేసింది. దేవాదాయశాఖ కార్యకలాపాలను ధార్మిక పరిషత్‌ ద్వారా నడిపించాలని 2009లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఇప్పటికీ వాటిని అమలు చేయడం లేదని పేర్కొంది. నిబంధనల ప్రకారం ట్రస్టు బోర్డుల నియామకం చేపట్టలేదని వివరించింది. ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయకపోవడం వల్లే దేవాదాయశాఖలో కుంభకోణాలు జరుగుతున్నాయని, సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ ఆరోపించారు.

Updated Date - 2021-02-01T09:00:48+05:30 IST