జాతీయస్థాయి పాటల పోటీల్లో ఆకాంక్ష ప్రతిభ

ABN , First Publish Date - 2021-12-30T18:26:41+05:30 IST

జాతీయస్థాయి పాటల పోటీల్లో వరంగల్‌ నగరానికి చెందిన ఇమ్మడి ఆకాంక్ష ప్రథమ బహుమతిని సాధిం చింది.

జాతీయస్థాయి పాటల పోటీల్లో ఆకాంక్ష ప్రతిభ

వరంగల్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 29 : జాతీయస్థాయి పాటల పోటీల్లో వరంగల్‌ నగరానికి చెందిన ఇమ్మడి ఆకాంక్ష ప్రథమ బహుమతిని సాధిం చింది. నేషనల్‌ ఇంట్రిగ్రేషన్‌ క్యాంపు తరఫున ఈనెల 16 నుంచి 22 వరకు ఒడిశా, భువనేశ్వర్‌ శిక్షా అనుసం ధానం యూనివర్సిటీలో నిర్వహిం చిన పాటల పోటీల్లో 20 రాష్ట్రాలకు చెందిన గాయకులు పాల్గొన్నారు. ఇందులో తెలంగాణకు చెందిన ఇమ్మడి ఆకాంక్ష ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్రస్థాయిలో ఆకాంక్ష ద్వితీయ స్థానం సాధించారు. ఆకాంక్ష ప్రస్తుతం వరంగల్‌లోని ఏఎస్‌ఎం మహిళా డిగ్రీ ్జకళాశాలలో పీజీ చదువుతున్నారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ బి.హరిసింగ్‌తో పాటు ఏవో విశ్వనారాయణ బుధవారం ఆకాంక్షను అభినందించారు. కార్యక్రమంలో ఆకాంక్ష తల్లిదండ్రులు మొగిలి, అరుణ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T18:26:41+05:30 IST