కేంద్రంపై పోరాటాలకు సిద్ధం కావాలి

ABN , First Publish Date - 2021-02-07T04:55:33+05:30 IST

కేంద్రంపై పోరాటాలకు సిద్ధం కావాలి

కేంద్రంపై పోరాటాలకు సిద్ధం కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌

గోవిందరావుపేట, ఫిబ్రవరి 6: ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్‌ పిలుపునిచ్చారు. మండలంలోని చల్వాయిలో బేతం కృష్ణకుమారి అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మే పనిలో ఉందని ఆరోపించారు. ప్రైవేట్‌ రంగంలో ఉన్న వాటిని ప్రభుత్వ రంగంలోకి తీసుకుని ప్రజలకు మేలు చేయాలనే ఉద్ధేశంతో నాటి పాలకులు పనిచేస్తే నేడు వాటికి విరుద్ధంగా కేంద్రం పనిచేస్తుందని అన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తొలగించి కార్మికులకు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎదిరిస్తూ సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌, నాయకులు వెల్దండి కొమురయ్య, చిక్కుల వెంకటేష్‌, సామల రమ, సారయ్య, పెద్దాపురం ఓదెలు, బండి నర్సయ్య, తోట సంపత్‌, రామరాజు, ఆదినారాయణ, సమ్మక్క, రాంబాబు, లావుడ్యా రాములు, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-07T04:55:33+05:30 IST