ఉద్యోగాలు ఎప్పుడిచ్చారో ప్రభుత్వం చెప్పాలి: సంపత్
ABN , First Publish Date - 2021-01-29T22:06:36+05:30 IST
యువకులను మోసం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. ఆయన మీడియాతో
హైదరాబాద్: యువకులను మోసం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నియామకాలు, నిరుద్యోగ భృతిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. లక్షా 30 వేల మందికి ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చారో తేదీలతో సహా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిరుద్యోగ భృతి అనడం దౌర్భాగ్యం అని ధ్వజమెత్తారు. 26 నెలల భృతి నిరుద్యోగులకు ఇచ్చి వారికి క్షమాపణ చెప్పాలని సంపత్ కుమార్ కోరారు.