అడ్వకేట్ దంపతుల హత్య దురదృష్టకరం: సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-03-17T21:17:36+05:30 IST

అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య చాలా దురదృష్టకరమని, ఖండిస్తున్నామని కేసీఆర్ అన్నారు.

అడ్వకేట్ దంపతుల హత్య దురదృష్టకరం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య చాలా దురదృష్టకరమని, ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనిపై బుధవారం అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ఘటనలో ఎవరున్నా వారిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇప్పటికే ఆరుగురుని అరెస్టు చేశారన్నారు. కుంటా శ్రీనివాస్, చిరంజీవి, కుమార్, శ్రీనివాస్, వడారి లచ్చయ్య, వసంతరావులు.. ఈ హత్యకు టీఆర్ఎస్ పార్టీకి ప్రమేయం లేదని, అయితే మండలపార్టీ అధ్యక్షుడు పేరు రావడంతో అరెస్టు చేయించామని, పార్టీ నుంచి బహిష్కరించామని చెప్పారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-03-17T21:17:36+05:30 IST