ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-10-31T22:24:45+05:30 IST

ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పులి చర్మం కేసులో అరెస్టులపై ఆదివాసీల ఆగ్రహించారు. అటవీశాఖ అధికారులపై..

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత

ఆదిలాబాద్: ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పులి చర్మం కేసులో అరెస్టులపై ఆదివాసీల ఆగ్రహించారు. అటవీశాఖ అధికారులపై దాడికి యత్నించారు. అధికారుల వాహనాల్లో గాలి తీసి నిరసన వ్యక్తం చేశారు. దండారి పర్వదినాల్లో బూట్లు వేసుకుని ఇళ్లల్లో తనిఖీలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులపై అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. 

Updated Date - 2021-10-31T22:24:45+05:30 IST