ఓటరు నమోదుపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-10-31T05:56:23+05:30 IST

ఓటరు నమోదుపై అవగాహన కలిగి ఉండాలి

ఓటరు నమోదుపై అవగాహన కలిగి ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌

అడిషనల్‌ కలెక్టర్‌ బి.హరిసింగ్‌ 


వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 30: ఓటరు నమోదుపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అడిషనల్‌ కలెక్టర్‌ బి.హరిసింగ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా స్థాయి స్వీప్‌ సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల్లో ఎలకో్ట్రల్‌ లిట్రసి క్లబ్‌లు ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదు, ఓటరు హెల్ప్‌లైన్‌, గరుడ ఆఫ్‌ పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాస్టర్‌ ట్రేయినర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాస్‌, ఎలక్షన్‌ సెల్‌ డీటీ సుభాన్‌, మండల విద్యాధికారులు, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


వందశాతం వాక్సినేషన్‌ చేయాలి

గీసుగొండ : ప్రతీ గ్రామంలో వందశాతం కొవిడ్‌ వాక్సినేషన్‌ చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ హరిసింగ్‌ అన్నారు. కొనాయిమాకుల గ్రామంలో శనివారం వాక్సి నేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని చెప్పారు. వీధుల్లో  ప్లాస్టిక్‌ వ్యర్థాలు లేకుండా చూడాలన్నారు. గ్రామ సమీపంలోని కెనాల్‌ వద్ద కోళ్ల వ్యర్థాలు పడేస్తున్నారని స్థానిక సర్పంచ్‌.. డోలి రాధాచిన్ని అడిషన్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో చెత్తాచెదారాన్ని పడేసివారిని గుర్తించి చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మరియాపురం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని  మల్టీ లేయర్‌ అవెన్యూప్లాంటేషన్‌, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి సర్పంచ్‌ అల్లం బాల్‌రెడ్డి, జీపీ కార్యదర్శి స్వప్నను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ డోలి రాధాచిన్ని, ఎంపీవో ప్రభాకర్‌, కార్యదర్శి సుకన్య, ఏపీవో మోహన్‌రావు, ఈసీ శ్రీలత, రాజు, రమేష్‌, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-31T05:56:23+05:30 IST