బర్డ్‌ఫ్లూ వ్యాధిపై అపోహలొద్దు

ABN , First Publish Date - 2021-02-06T04:32:18+05:30 IST

బర్డ్‌ఫ్లూ వ్యాధిపై అపోహలొద్దు

బర్డ్‌ఫ్లూ వ్యాధిపై అపోహలొద్దు
వాల్‌పోస్టర్‌, కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి

అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి

ములుగు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 5: బర్డ్‌ఫ్లూ వ్యాధిపై ప్రజలు అపోహలు పడవద్దని అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి అన్నారు. ములుగులోని కలెక్టరేట్‌లో శుక్రవారం పశువైద్యం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్‌, కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పూర్తిగా ఉడికించిన కోడి మాంసం, కోడిగుడ్లు తినడం ద్వారా మనుషులకు బర్డ్‌ఫ్లూ రాదని, ఇప్పటి వరకు దేశంలో బర్డ్‌ఫ్లూ వ్యాధి మనుషులకు సోకిన దాఖలాలు లేవని అన్నారు. ఉడికించిన కోడి మాంసం, గుడ్లను నిర్భయంగా తిని ఆరోగ్యంగా ఉండాలన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ కె.విజయభాస్కర్‌ మాట్లాడుతూ బర్డ్‌ఫ్లూ వైరస్‌ వ్యాధి అని, ఇది పక్షుల నుంచి పక్షులకే సోకుతుందని తెలిపారు. జిల్లాలో మినీ మేడారం జాతర ఫిబ్రవరి 24 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నందున పస్రా, తాడ్వాయి, కొత్తూరులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి కోళ్ల రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు ముందుజాగ్రత్త చర్యగా పంపించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రమాదేవి, తహసీల్దార్‌ సత్యనారాయణస్వామి, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు కృష్ణమూర్తి, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ బి.నర్సింహ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T04:32:18+05:30 IST