పర్యావరణాన్ని పరిరక్షించాలి: ఏసీపీ

ABN , First Publish Date - 2021-08-25T05:39:15+05:30 IST

పర్యావరణాన్ని పరిరక్షించాలి: ఏసీపీ

పర్యావరణాన్ని పరిరక్షించాలి: ఏసీపీ
కొత్తూరులో పత్తి చేనులో వ్యవసాయ కూలీలతో ముచ్చటిస్తున్న ఏసీపీ

ఖానాపురం,ఆగస్టు 24: మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఏసీపీ ఫణీందర్‌ అన్నారు. మంగళవారం కొత్తూరులో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఐ సతీష్‌బాబుతో కలిసి మొక్కలు నాటా రు. ఏసీపీ మాట్లాడుతూ నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలన్నారు. అనంతరం సమీపంలోని పత్తి చేలల్లో కలుపుతీస్తున్న కూలీలను చూసి ఏసీపీ నేరుగా వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బూస రమ, సొసైటీ డైరెక్టర్‌ లక్ష్మణ్‌, ఎస్సై నండ్రు  సాయిబాబు, ట్రైనీ ఎస్సై అమర్లపుడి విశ్వతేజ, బూస అశోక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-25T05:39:15+05:30 IST