లారీ, డీసీఎం ఢీ .. లారీ డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-02-06T04:35:49+05:30 IST

లారీ, డీసీఎం ఢీ .. లారీ డ్రైవర్‌ మృతి

లారీ, డీసీఎం ఢీ .. లారీ డ్రైవర్‌ మృతి
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ రమే్‌షకుమార్‌

శాయంపేట, ఫిబ్రవరి 5 : గోవిందాపూర్‌ స్టేజి వద్ద గురువారం అర్ధరాత్రి లారీ, డీసీఎం ఢీ కొన్న ఘటనలో లారీ డ్రైవ ర్‌ గ్యార కృష్ణయ్య(27) అక్కడిక్కడే మృతి చెందారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ కథనం ప్రకా రం.. రంగారెడ్డి జిల్లా సుద్దపల్లికి చెందిన కృష్ణయ్య లారీ ఓనర్‌ జక్కుల శ్రీనివాస్‌ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం లారీలో గోదావరి నుంచి ఇసుక లోడు చేసుకొని పరకాల నుంచి హన్మకొండ వైపు వెళ్తుండగా, పరకాల వైపు డీసీఎం వ్యాను ఎదురుగా రావడంతో గోవిందాపూర్‌ స్టేజి వద్ద ఢీకొన్నాయి. లారీ రోడ్డు పక్కనే ఉన్న గోతిలో ఇరుక్కోవడంతో కృష్ణయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని సీఐ రమే్‌షకుమార్‌ పరిశీలించారు. కృష్ణయ్య భార్య సారిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.Updated Date - 2021-02-06T04:35:49+05:30 IST