వాహనం ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-01-21T03:44:22+05:30 IST

వాహనం ఢీకొని యువకుడి మృతి

వాహనం ఢీకొని యువకుడి మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌, జనవరి 20: డివిజన్‌ కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలమాకుల నర్సయ్య (32) అనే యువకుడు మృతి చెందాడు. లింగాలఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన నర్సయ్య తాటికొండలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో శ్రీవాణి గురుకులం పాఠశాల ఎదురుగా రోడ్డును క్రాస్‌ చేస్తుండగా హన్మకొండ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్యను పోలీసులు స్థానిక పీహెచ్‌సీకి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందాడని చెప్పారు. అనంతరం మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎంకు తర లించారు. నర్సయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి మల్లయ్య ఇటీవలే మృతి చెందాడని బంధువులు తెలిపారు. ఎస్సై ఎస్సై రమేశ్‌నాయక్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-01-21T03:44:22+05:30 IST