ఆమె పేరిట అతడి ఫ్రెండ్‌షిప్‌

ABN , First Publish Date - 2021-05-05T16:46:01+05:30 IST

ఓ అందమైన ప్రొఫైల్‌ పిక్‌ ఉన్న అకౌంట్‌ నుంచి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. వెంటనే యాక్సప్ట్‌ చేశాడు. చాటింగ్‌ల ద్వారా వారి మధ్య పరిచయం పెరిగింది. ఒకరినొకరు వాట్సాప్‌ నెంబర్లు...

ఆమె పేరిట అతడి ఫ్రెండ్‌షిప్‌

ఫేస్‌బుక్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేసే ముందు జాగ్రత్త   

మోసపోతో భారీ మూల్యం చెల్లించక తప్పదు


ఓ అందమైన ప్రొఫైల్‌ పిక్‌ ఉన్న అకౌంట్‌ నుంచి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. వెంటనే యాక్సప్ట్‌ చేశాడు. చాటింగ్‌ల ద్వారా వారి మధ్య పరిచయం పెరిగింది. ఒకరినొకరు వాట్సాప్‌ నెంబర్లు కూడా షేర్‌ చేసుకున్నారు. ఒకరి ఫొటోలు మరొకరు షేర్‌ చేసుకున్నారు. నూడ్‌ వీడియోలు కూడా పంపుకునే వారు. తీరా చివరకు తేలిందేమిటంటే ఆ చాటింగ్‌ చేసేది ఆమె కాదు అతడు అని. అటునుంచి వచ్చిన ఫొటోలు, నూడ్‌ వీడియోలు కూడా క్రియేట్‌ చేసినవే అని. ఇతని వీడియోలు మాత్రం వారికి చిక్కాయి. వాటి ఆధారంగా డబ్బులు చేయడం ప్రారంభించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి)

ఈవెంట్‌ మేనేజర్‌కు బురిడీ

హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌ మేనేజర్‌కు కొద్ది రోజుల క్రితం ఓ యువతి పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. దీన్ని అతడు యాక్సెప్ట్‌ చేశాడు. అవతలి వ్యక్తి తాను ముంబైలో మోడలింగ్‌ చేస్తున్నానంటూ తెలిపింది. ఒకటి రెండు రోజుల చాటింగ్‌ అనంతరం వారి మధ్య పరిచయం పెరిగింది. ఫోన్‌ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ తర్వాత వాట్సా్‌పలో వారి మధ్య సెక్స్‌ చాటింగ్‌ మొదలైంది. ఈ క్రమంలోనే వీడియో కాల్‌ చేసిన అవతలి వ్యక్తులు ఇంటర్నెట్‌లో లభించిన కొన్ని నగ్న వీడయోలను చూపుతూ అవి లైవ్‌ అన్నట్లుగా కొన్ని యాప్స్‌ సాయంతో అతనికి భ్రమ కలిగించారు. నిజమేనని భావించిన అతడు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడిపోయాడు.


అవతలి వైపు నుంచే తీయటి మాటలకు లొంగిపోయి తన గదిలో దుస్తులు కూడా విప్పేసి మాటల్లో పడిపోయాడు. యాప్స్‌ సాయంతో సైబర్‌ నేరగాళ్లు ఆ వీడియోలను రికార్డ్‌ చేసి సేవ్‌ చేశారు. అలా  సేవ్‌ చేసిన వీడియోలను వాట్సాప్‌ ద్వారా అతనికి పంపి బ్లాక్‌ మెయిలింగ్‌ మొదలుపెట్టారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నూడ్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతామని, స్నేహితులకు పంపుతామని బెదిరించేవారు. దీంతో బాధితుడు రెండు విడతలుగా రూ. 10 లక్షలు చెల్లించుకున్నాడు. అయినా బ్లాక్‌ మెయిలింగ్‌ ఆగలేదు. మరింత డబ్బు కోసం సైబర్‌ నేరగాళ్ల వేధింపులు పెరిగాయి. భరించలేక అతడు సైబర్‌ కైరమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.


ఐఏఎస్‌ కావాల్సిన వ్యక్తి

బెంగళూరులోని భత్తరహళ్లికి చెందిన ఓ యువకుడు ఐఏఎస్‌ సాధించాలనే ధ్యేయంతో సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతున్నాడు. అతని ఫేస్‌బుక్‌ అకౌంట్‌కి ఓ అమ్మాయి నుంచి ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. అతడు ఆ రిక్వె్‌స్టను ఓకే చేశాడు. ఆ మరుసటి రోజు నుంచి యువకుడిని కవ్వించి నూడ్‌ వీడియో కాల్‌ వరకూ తీసుకెళ్లింది. అది రికార్డ్‌ చేసుకున్న అవతలి వ్యక్తి ఓ రోజు అదే వీడియోలను అతని ఫోన్‌కే పంపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. కొద్దిసేపటికి ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌  చేయడం మొదలు పెట్టారు. సైబర్‌ నేరగాళ్ల బ్లాక్‌ మెయిలింగ్‌ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.


పోలీసుల విచారణలో నిర్ఘాంతపోయే విషయాలు బయటకు వచ్చాయి. చనిపోయిన యువకుడిని కేవలం ఫోన్‌ ద్వారానే ట్రాప్‌ చేసినట్లు తేలింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీ క్రియేట్‌ చేసి అతడికి మెసేజ్‌లు పంపుతూ వలలో వేసుకున్నారు. యువతి నూడ్‌ వీడియో కాల్‌ చేస్తున్నట్లు నమ్మించారు. ఆ వైపు అమ్మాయి దుస్తులు విప్పినట్లు యాప్‌ ద్వారా క్రియేట్‌ చేసి అతడిని రెచ్చగొట్టారు. అతను కూడా నూడ్‌ వీడియో కాల్‌ చేసేలా మార్చారు. ఆ తర్వాత వీడియోను రికార్డ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలు పెట్టారు. వాస్తవంగా అటు వైపు అమ్మాయి లేనే లేదు. కేవలం అమ్మాయి ఉన్నట్లు భ్రమింపచేసి అతడిని ట్రాప్‌లో పడేశారు. 


డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచమైన యువతి వలలో కూడా జీడిమెట్లకు చెందిన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఇలానే పడ్డాడు. డబ్బులు కోసం సైబర్‌ నేరగాళ్ల వేధింపులు భరించ లేక బషీరాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇటువంటి ఘటనల నేపథ్యంలో ఎవరైనా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వె్‌స్టలను యాక్సప్ట్‌ చేసే ముందు అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-05-05T16:46:01+05:30 IST