కారు, ద్విచక్రవాహనం ఢీ.. ఇంటర్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-01-01T05:14:14+05:30 IST

కారు, ద్విచక్రవాహనం ఢీ.. ఇంటర్‌ విద్యార్థి మృతి

కారు, ద్విచక్రవాహనం ఢీ.. ఇంటర్‌ విద్యార్థి మృతి

ముగ్గురికి తీవ్రగాయాలు


పర్వతగిరి, డిసెంబరు 31: కారు ఢీకొని ఇంటర్‌ విద్యార్థి మృతి చెందగా మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఇన్‌చార్జి ఎస్సై సీమా ఫర్హీన్‌ కథనం ప్రకారం.. చింతనెక్కొండ గ్రామానికి చెందిన యా కయ్య, రజిత దంపతుల కుమారుడు తాళ్ల ప్రవీణ్‌(17) మండలకేంద్రంలోని మోడల్‌స్కూల్‌లో ఇంటర్‌ ఎంపీసీ ఫస్టియర్‌ చదువుతున్నాడు. అదే స్కూల్‌లోని ప్రవీణ్‌ స్నేహితులు దేవీలాల్‌తండాకు చెందిన జాటోత్‌ దినేష్‌, బూర్గుమళ్ల గ్రామానికి చెం దిన ఈదుల వినయ్‌, నాళ్లం కార్తికేయ కలిసి ఒకే ద్విచక్రవాహనంపై శుక్రవారం మండలకేంద్రం వైపు వస్తున్నారు. మరోవైపు గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామానికి చెందిన పలువురు భ క్తులు కారులో మండలంలోని అన్నారంషరీఫ్‌ దర్గాను దర్శించుకొని తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో మండలకేంద్రం శివారులో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనగా ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతిచెం దాడు. మిగతా విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంట నే క్షతగాత్రులను 108 వాహ నంలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో కల్లెడ గ్రామానికి ఒక ప్రైవేట్‌ కార్యక్రమానికి వెళ్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ సహాయక కార్యక్రమాలను పర్యవే క్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ఎంజీ ఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుడి తండ్రి యాకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-01T05:14:14+05:30 IST