విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

ABN , First Publish Date - 2021-12-08T05:43:01+05:30 IST

విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబరు  7: విద్యార్థుల సమస్య ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. భూపాలపల్లిలోని అంబేద్కర్‌ సెంటర్‌లో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నినదించారు. ముఖ్యంగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయిం బర్స్‌మెంట్స్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూనుకున్నారని మండిపడ్డారు. ఏబీవీపీ నాయకులు రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శాంతింపజేయడానికి యత్నించారు. నిరసన ఉధృత రూపం దాల్చడంతో ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ రాజుకుమార్‌,  నాయకులు వికాస్‌, ప్రేమ్‌, శ్రీనాఽథ్‌, తరుణ్‌, సాయి, హరీశ్‌, శివాజీ, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:43:01+05:30 IST