ఏబీఎన్ కథనానికి స్పందించిన దాతలు

ABN , First Publish Date - 2021-07-14T18:30:24+05:30 IST

అన్నదమ్ములే కాడెద్దులుగా మారి పొలం దున్నుతున్నారని ఏబీఎన్‌లో ప్రసారమైన కథనానికి..

ఏబీఎన్ కథనానికి స్పందించిన దాతలు

ములుగు జిల్లా: అన్నదమ్ములే కాడెద్దులుగా మారి పొలం దున్నుతున్నారని ఏబీఎన్‌లో ప్రసారమైన కథనానికి దాతలు స్పందించారు. బాధిత కుటుంబానికి తోచినంత సాయం అందించారు. దీంతో ఆ అన్నదమ్ములు కాడెద్దులను కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. ములుగు జిల్లా, మంగపేట మండలం, దోమెడ గ్రామానికి చెందిన తమ్మయ్యకు కొడుకులు నరేందర్, శ్రీనివాస్ ఉన్నత చదువులు చదివారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే  కరోనా ప్రభావంతో ఉద్యోగాలు పోయి సొంతూరుకు వచ్చారు. వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే వారి కాడెద్దులు రెండు చనిపోయాయి. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్నవారు.. ఎద్దులు కొనలేని పరిస్థితిలో వారే ఎద్దులుగా మారి వ్యవసాయం చేస్తున్నారు. ఈ కథనాన్ని ఈనెల 5న ఏబీఎన్ ప్రసారం చేయగా దాతలు పెద్ద ఎత్తున స్పందించారు.

Updated Date - 2021-07-14T18:30:24+05:30 IST