ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు

ABN , First Publish Date - 2021-05-08T21:57:00+05:30 IST

కరోనా వీర విజృంభణ సమయంలోనూ దారుణాలు ఆగడం లేదు. జగిత్యాల మండలం జాబితాపూర్‌లో దారుణం జరిగింది

ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు

జగిత్యాల : కరోనా వీర విజృంభణ సమయంలోనూ దారుణాలు ఆగడం లేదు. జగిత్యాల మండలం జాబితాపూర్‌లో దారుణం జరిగింది. ప్రేమించడం లేదని యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి మెడ, వెనుక భాగంలో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత యువకుడు ఆ యువతి ఇంటి వద్ద కత్తితో గొంతు కోసుకొని, ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆ యువకుడ్ని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడి తర్వాత యువతి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. మెడ వెనుక భాగంలో స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రస్తుతం ఆమె ఇంటి వద్దే ఉంది. యువకుడి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఈ ఘటనపై డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-08T21:57:00+05:30 IST