డాక్టర్‌ రఘురామ్‌కు అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2021-01-01T07:40:34+05:30 IST

ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ సీఈవో, కిమ్స్‌ ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రఘురామ్‌ పిల్లరిశెట్టికి అరుదైన గౌరవం లభించింది. క్వీన్‌ ఎలిజబెత్‌ 2 న్యూఇయర్‌ ఆనర్స్‌ లిస్ట్‌ 2021లో

డాక్టర్‌ రఘురామ్‌కు అరుదైన గౌరవం

క్వీన్‌ ఎలిజబెత్‌ ‘ఆనర్స్‌ లిస్ట్‌’లో చోటు


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ సీఈవో, కిమ్స్‌ ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రఘురామ్‌ పిల్లరిశెట్టికి అరుదైన గౌరవం లభించింది. క్వీన్‌ ఎలిజబెత్‌ 2 న్యూఇయర్‌ ఆనర్స్‌ లిస్ట్‌ 2021లో  చోటు లభించింది. ఆఫీసర్‌ ఆఫ్‌ ద మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌గా గౌరవించనున్నారు. యూకేలో నైట్‌హుడ్‌ పురస్కారం తర్వాత ఇదే అత్యుత్తమ రెండో ర్యాంకింగ్‌. 54 ఏళ్ల డాక్టర్‌ రఘురామ్‌ గడిచిన 100 ఏళ్లలో ఈ అవార్డును అందుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు సాధిం చారు. ఈ సందర్భంగా రఘురామ్‌ మాట్లాడుతూ బ్రిటిష్‌ ఎంపైర్‌ అందించిన గౌరవానికి ధన్యవాదాలు తెలిపారు. యూకేలో రొమ్ము కేన్సర్‌కు చేస్తున్న అత్యాధునిక చికిత్సను స్వదేశానికి అందించడంలో  వారధిలా పని చేశానన్నారు. తనకు పూర్తి స్వేచ్చను ఇచ్చిన కిమ్స్‌ యాజ మాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఈ గౌరవం నటుడు ఓంపురి, ప్రొఫెసర్‌ మైఖేల్‌ గ్రిఫిన్‌, ఆటగాడు డేవిడ్‌ బేక్‌హోం, ఇంగ్లాండ్‌ క్రికెట్‌  కెప్టెన్‌ బెన్‌ స్ట్రోక్స్‌ తదితరులకు లభించింది. కాగా, బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన 1,239 మంది ప్రముఖులకు యూకే ‘ఆనర్స్‌ లిస్ట్‌’లో చోటు దక్కింది. బ్రిటిష్‌ ఇండియన్‌ టెలివిజన్‌, బాలీవుడ్‌ నటి నైనా వాదియా, లండన్‌లోని సుట్టాన్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ దిపన్‌వితా గంగూలీలకు  ఓబీఈ అవార్డును బహూకరించారు.

Updated Date - 2021-01-01T07:40:34+05:30 IST