బొన్సాయ్‌ మొక్క చోరీ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి భార్య ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-01-13T09:10:31+05:30 IST

ఓ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఇంట్లో అరుదైన బొన్సాయ్‌ మొక్క చోరీకి గురైంది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 18 ప్లాట్‌ నంబరు 406లో విశ్రాంత ఐపీఎస్‌ అప్పారావు తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. వారు 15

బొన్సాయ్‌ మొక్క చోరీ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి భార్య ఫిర్యాదు

బంజారాహిల్స్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఓ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఇంట్లో అరుదైన బొన్సాయ్‌ మొక్క చోరీకి గురైంది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 18 ప్లాట్‌ నంబరు 406లో విశ్రాంత ఐపీఎస్‌ అప్పారావు తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. వారు 15 సంవత్సరాల క్రితం అరుదైన బొన్సాయ్‌ మొక్కను కొనుగోలు చేశారు. ప్రధాన గేటు వద్ద నాటారు. రెండు రోజుల క్రితం తోట మాలి దేవేందర్‌ మొక్కలకు నీరు పోస్తుండగా బొన్సాయ్‌ మొక్క కనిపించలేదు. ఈ విషయాన్ని యజమానులకు చెప్పాడు. అప్పారావు భార్య వి.శ్రీదేవి దీనిపై జూబ్లిహిల్స్‌ పోలీసులకు పిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం జడె మొక్క కూడా చోరీకి గురైందన్నారు.

Updated Date - 2021-01-13T09:10:31+05:30 IST