ఎమ్మెల్యేలతో బహిరంగ క్షమాపణ చెప్పించాలి

ABN , First Publish Date - 2021-11-23T09:01:59+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడడం నిజమే అయితే, ఆ విధంగా మాట్లాడిన వారి చేత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పించాలని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.

ఎమ్మెల్యేలతో బహిరంగ క్షమాపణ చెప్పించాలి

ఏపీ సీఎం జగన్‌కు మందకృష్ణ డిమాండ్‌ 

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడడం నిజమే అయితే, ఆ విధంగా మాట్లాడిన వారి చేత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పించాలని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. ఏపీ సీఎం జగన్‌ను డిమాండ్‌ చేశారు. ఆ విధంగా  క్షమాపణలు చెప్పించగలిగితే అవమానానికి గురైన భువనేశ్వరికి కొంతలో కొంతైనా స్వాంతన చేకూరుతుందని, ఆ  కుటుంబం మానసిక వేదన నుంచి కొంతమేరకు బయటపడుతుందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-23T09:01:59+05:30 IST