పిల్లలతో రైలు కిందకు దూకిన తల్లి!

ABN , First Publish Date - 2021-07-12T08:48:41+05:30 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త... ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు... ఇంతలోనే భర్త ప్రవర్తనలో మార్పు.. కట్నం కోసం వేధింపులు... దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తన ఇద్దరు పిల్లలను

పిల్లలతో రైలు కిందకు దూకిన తల్లి!

తల్లి, కూతురు అక్కడికక్కడే మృతి

ఆస్పత్రిలో చావుబతుకుల్లో కొడుకు 

తల్లి, కూతురు అక్కడికక్కడే మృతి

రామగుండం రైల్వేస్టేషన్‌లో ఘటన

కట్నం కోసం భర్త వేధింపులతోనే..


అంతర్గాం, జూలై 11: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త... ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు... ఇంతలోనే భర్త ప్రవర్తనలో మార్పు.. కట్నం కోసం వేధింపులు... దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తన ఇద్దరు పిల్లలను రైలు కింద పడేసి, తానూ రైలు కిందకు దూకింది. ఈ ఘటనలో తల్లి, కుమార్తె మృతి చెందగా,  కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. విషాదకర ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లో ఆదివారం జరిగింది. యైుటింక్లయిన్‌ కాలనీకి చెందిన జాగేటి ప్రవీణ్‌, కమాన్‌పూర్‌ మండలం జూలపల్లికి చెందిన అరుణ(31)లు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సాత్విక్‌(5), సాత్విక(2). కాగా, రెండేళ్లుగా పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని ప్రవీణ్‌ తన భార్యను వేధిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరుణ, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.


పిల్లలను దూసుకొస్తున్న రైలు కిందకు తోసిన ఆమె.. తాను కూడా దూకింది. దీంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలైన సాత్విక్‌, సాత్వికలను రైల్వే అధికారులు వెంటనే గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ సాత్విక చికిత్స పొందుతూ మృతి చెందింది. సాత్విక్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించారు. రామగుండం జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-12T08:48:41+05:30 IST