927 అక్రమ నిర్మాణాలను కూల్చివేత
ABN , First Publish Date - 2021-12-30T06:26:48+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 927 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 927 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు మునిసిపల్ శాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటిలో మునిసిపాలిటీల్లో 459, హెచ్‌ఎండీఏ పరిధిలో 468 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలను నిరంతరం గుర్తిస్తున్నామన్నారు.