రాష్ట్రవ్యాప్తంగా 900 ఐసీయూ బెడ్లు
ABN , First Publish Date - 2021-12-09T07:08:22+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో త్వరలో రూ.154 కోట్లతో

- రూ.154 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
మాదాపూర్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో త్వరలో రూ.154 కోట్లతో 900లకు పైగా ఐసీయూ పడకలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 33 జిల్లాల్లో 6000 పడకలతో చిన్న పిల్లల కోసం పీడియాట్రిక్ విభాగాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలకు డిమాండ్ ఏర్పడిందని, ఈ మేరకు తగిన సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. కొండాపూర్‌లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రహేజా ఐటీ పార్కు సహకారంతో 100 పడకలతో ఏర్పాటు చేసిన అదనపు అంతస్తును సబితాఇంద్రారెడ్డితో కలిసి బుఽధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత సమయంలో కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని, ఆస్పత్రుల్లో 27వేల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రోజుకు నాలుగు లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నామని, 100ు పూర్తవాలంటే ప్రజాప్రతినిధుల సహకారంతో పాటు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. త్వరలోనే కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ యూని ట్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యే గాంధీ తదితరులు పాల్గొన్నారు.