రాష్ట్రాలకు 8,873.6 కోట్ల విపత్తు నిధులు

ABN , First Publish Date - 2021-05-02T09:02:34+05:30 IST

కరోనా నేపథ్యంలో నిధుల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్రాలకు కేంద్రం తీపికబురు చెప్పింది.

రాష్ట్రాలకు 8,873.6 కోట్ల విపత్తు నిధులు

షెడ్యూలుకు ముందే విడుదల చేశామన్న కేంద్రం

న్యూఢిల్లీ, మే 1(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో నిధుల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్రాలకు కేంద్రం తీపికబురు చెప్పింది. రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధి నుంచి 8,873.6 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర  ఆర్థిక శాఖ వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంఽధించి తొలివిడతగా రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని విడుదల చేశామని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఎవరికెంత కేటాయించారో వెల్లడించకపోవడం గమనార్హం. మొత్తం నిధుల్లో 50ు... అంటే రూ.4,436.8కోట్లను కరోనా నియంత్రణ చర్యల కోసం వాడుకోవచ్చని కేంద్రం సూచించింది. సాధారణంగా కేంద్ర ఆర్ధిక సంఘం సిఫారసులకు అనుగుణంగా ఏటా జూన్‌లో ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులు విడుదల చేయాల్సి ఉందని, ఈ ఏడాది ముందుగానే విడుదల చేశామని ఆర్ధికశాఖ వెల్లడించింది. రాష్ర్టాల నుంచి నిధుల యూసీల ఎదురుచూడకుండా తొలివిడత నిధులను మంజూరు చేసినట్టు పేర్కొంది. 

Updated Date - 2021-05-02T09:02:34+05:30 IST