60 అడుగుల కవిత రంగోలి చిత్రం

ABN , First Publish Date - 2021-03-14T07:44:37+05:30 IST

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా రవీంద్రభారతి ప్రాంగణంలో 60 అడుగుల కవిత రంగోలి చిత్రాన్ని చిత్రీకరించారు.

60 అడుగుల కవిత రంగోలి చిత్రం

హైదరాబాద్‌, కవాడిగూడ, రవీంద్రభారతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా రవీంద్రభారతి ప్రాంగణంలో 60 అడుగుల కవిత రంగోలి చిత్రాన్ని చిత్రీకరించారు. నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు పబ్బ సాయిప్రసాద్‌ ఆధ్వర్యంలో మహారాష్ట్రకు చెందిన చిత్రకారుడు శైలేష్‌ కులకర్ణి ఈ చిత్రాన్ని తయారు చేశాడు. వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర పరాట్యక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌, జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ చారి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, తన పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొక్కలు నాటా రు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో తన తల్లి శోభమ్మ, సోదరుడు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌తో కలిసి శనివారం మొక్కలు నాటారు. ఏందో నీ మాయ. శివయ్యకు కోటివృక్షార్చన పాటను ఎంపీ జోగినపల్లి సంతో్‌షకుమార్‌ శనివారం విడుదల చేశారు. ఈ పాటను సినీ నటుడు, గాయకుడు రాకింగ్‌ రాకేష్‌ రూపొందించారు. 


విద్యార్థినులకు సైకిళ్లు.. దివ్యాంగులకు స్కూటీలు 

తెలంగాణ పల్లె పండుగ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన కృషి ఎనలేనిదని హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. దోమలగూడలో జరిగిన కవిత జన్మ దిన వేడుకల్లో  ఆయన మాట్లాడారు. అనంతరం 30 మంది విద్యా ర్థినులకు సైకిళ్లు, ఆరుగురు దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు. 

Updated Date - 2021-03-14T07:44:37+05:30 IST