5 కిలోల మగశిశువు జననం

ABN , First Publish Date - 2021-10-21T05:07:50+05:30 IST

5 కిలోల మగశిశువు జననం

5 కిలోల మగశిశువు జననం

ఆరోగ్యంగా తల్లీబిడ్డ

వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఘటన


వర్ధన్నపేట, అక్టోబరు 20 : వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఓ మహిళ 5 కిలోల మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాలకు చెందిన గద్దల స్పందనకు అదే గ్రామంలోని పరశురాం అనే వ్యక్తితో 11 నెలల క్రితం వివాహమైంది. స్పందన గర్భిణిగా మొదటి నెల నుంచి వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికే వచ్చి చికిత్స చేసుకుని వైద్యుల సూచనలు పాటించినట్లు తెలిపారు. ఆమె ప్రసవం కోసం మంగళవారం ఆస్పత్రిలో చేరింది. సూపరింటెండెంట్‌ నర్సింహస్వామి ఆధ్వర్యంలో వైద్యులు బుధవారం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించగా 5 కిలోల మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, ఇలాంటి అరుదైన ఆపరేషన్‌ వందలో ఒకటి జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో సర్జన్‌ మానసరెడ్డి, పిల్లల వైద్యుడు తిరుపతిరెడ్డి, సిబ్బంది దివ్య, సునంద, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:07:50+05:30 IST