తెలంగాణలో కొత్తగా 331 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-01-13T16:10:08+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా..

తెలంగాణలో కొత్తగా 331 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్: తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 331 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 2,90,640కి చేరుకుంది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. మొత్తంగా ఇప్పటి వరకూ 1,571 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 4,458 యాక్టివ్ కేసులున్నాయి. 2,84,611 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. కాగా.. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 61 కరోనా కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2021-01-13T16:10:08+05:30 IST