హైదరాబాద్‌లో కుండపోత

ABN , First Publish Date - 2021-07-08T08:03:52+05:30 IST

హైదరాబాద్‌ నగరంలో బుధవారం కుండపోతగా వర్షం కురిసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో

హైదరాబాద్‌లో కుండపోత

రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు!


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

హైదరాబాద్‌ నగరంలో బుధవారం కుండపోతగా వర్షం కురిసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మౌలాలిలో అత్యధికంగా 5.2 సెంటీమీటర్లు, ఉప్పల్‌లో 5, కాప్రాలో 4.9, బాలానగర్‌లో 3.8, బాచుపల్లిలో 6.1, కూకట్‌పల్లిలో 2.5, చర్లపల్లిలో 4.6, ఖైరతాబాద్‌లో 3.5, శ్రీనగర్‌ కాలనీలో 3.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వికారాబాద్‌ జిల్లా మద్గుల్‌ చిట్టంపల్లిలో 6.7 సెంటీమీటర్లు, బొంరా్‌సపేట మండలం దుద్యాలలో 2.83, కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌లో 2.70, దౌల్తాబాద్‌లో 2.50, కీసరలో 1.73 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో అత్యధికంగా 7.0 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసరలో గాలివానకు హోర్డింగ్‌ ఒకటి కూలిపోయింది. కాగా రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-08T08:03:52+05:30 IST