28 నుంచి ఐసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-11-26T08:54:01+05:30 IST

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది.

28 నుంచి ఐసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులు, స్లాట్‌ బుకింగ్‌లు ఈనెల 28, 29 తేదీల్లో చేసుకోవచ్చు. ఇంతకుముందు జరిగిన రెండు విడతల్లో సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కానివారు మళ్లీ దరఖాస్తు చేసుకుని హాజరుకావచ్చని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. ఈనెల 29న సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఉంటుందని, ఎంపికైన వారి జాబితా 30న విడుదల చేస్తామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.   

Updated Date - 2021-11-26T08:54:01+05:30 IST