ప్యాకేజీ కింద 25 వేల కోట్లు ఇవ్వాలి: సంతోష్‌

ABN , First Publish Date - 2021-03-24T08:30:55+05:30 IST

తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.25,105 కోట్లు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ప్యాకేజీ కింద 25 వేల కోట్లు ఇవ్వాలి: సంతోష్‌

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):  తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.25,105 కోట్లు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.  రాజ్యసభలో మంగళవారం జమ్మూ అండ్‌ కశ్మీర్‌, పుదుచ్చేరి ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో  భగీరథ పథకానికి 2019-20నుంచి మూడేళ్లకు ఏటా రూ.450 కోట్ల వంతున మొత్తం రూ.1,350 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 14 ఆర్థికసంఘం సిఫారసుల మేరకు రూ.817.61 కోట్లు ఇవ్వాలన్నారు.  

Updated Date - 2021-03-24T08:30:55+05:30 IST