వరంగల్ హైవేపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 24 మందికి తీవ్ర గాయాలు..

ABN , First Publish Date - 2021-01-13T14:47:07+05:30 IST

వరంగల్: కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా..

వరంగల్ హైవేపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 24 మందికి తీవ్ర గాయాలు..

వరంగల్: కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద ఉన్న ఈ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 24మందికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2021-01-13T14:47:07+05:30 IST