సిద్దిపేట జిల్లాలో కొత్తగా 23 మద్యం దుకాణాలు

ABN , First Publish Date - 2021-11-10T00:33:07+05:30 IST

జిల్లాకు కొత్తగా 23 మద్యం దుకాణాలు మంజూరయినట్లు ఎక్సైజ్

సిద్దిపేట జిల్లాలో కొత్తగా 23 మద్యం దుకాణాలు

సిద్దిపేట: జిల్లాకు కొత్తగా 23 మద్యం దుకాణాలు మంజూరయినట్లు ఎక్సైజ్ సూరింటెండెంట్ విజయ్ భాస్కర్  తెలిపారు. పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో విజయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పాతవి 70 మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. కొత్త వాటితో కలిపి మొత్తం 93 మద్యం దుకాణాలు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రిజర్వేషన్ల ప్రకారం ఇందులో గౌడ కులస్థులకు 16 షాపులు, ఎస్సీలకు 9 షాపులు, 68 జనరల్ రిజర్వేషన్ ప్రకారం దుకాణాల కేటాయింపు ఉంటుందన్నారు. ఈ నెల 20న విపాంచి కళనిలయంలో కలెక్టర్ అధ్వర్యంలో డ్రా తీయబడునని ఆయన తెలిపారు. టెండర్ ఫాం ఖరీదు రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్‌గా ఉంటుందన్నారు. 


Updated Date - 2021-11-10T00:33:07+05:30 IST