16 నుంచి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-01-13T09:27:23+05:30 IST

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 16 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఈనెల 16 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు

16 నుంచి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 16 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఈనెల 16 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. 24న అర్హుల జాబితా విడుదల చేస్తారు. 24-25 వరకు వెబ్‌ ఆప్షన్లకు గడువు ఉంటుందని, 27న విద్యార్థుల జాబితాను ప్రకటిస్తామని కన్వీనర్‌ ఆచార్య పి.రమేశ్‌ బాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, రెండో విడత కౌన్సెలింగ్‌ ఫిబ్రవరి 8 నుంచి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-01-13T09:27:23+05:30 IST